Ad Code

జనాదరణ పొందిన ఎంజీ కామెట్‌ ఎలక్ట్రిక్‌ కారు !


ఎంజీ మోటర్ గతేడాది లాంచ్‌ అయిన ఎంజీ కామెట్‌ ఎలక్ట్రిక్‌ కారు మంచి జనాదరణ పొందింది. సిటీ పరిధిలో వినియోగానికి బాగా సరిపోతుండటంతో మధ్య తరగతితో పాటు ఉ‍న్నత వర్గాల వారు కూడా దీనిని కొనుగోలు చేస్తున్నారు. ఎంజీ కామెట్ ఈవీ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. కామెట్ విడుదలకు ముందు అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా టాటా టియాగో EV ఉండింది. Tiago EV ధరలు రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఎంజీ కామెట్ ఈవీ కారు ప్రారంభ ధర Tiago EV కంటే రూ. 1 లక్ష తక్కువ. కామెట్ EV ధర రేంజ్ రూ. 6.99 లక్షల నుంచి మొదలవుతుండగా.. టాప్ వేరియంట్ ధర రూ. 9.14 లక్షల వరకు ఉంటుంది. కొంతకాలం క్రితం వరకు ఇది ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ అనే మూడు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు వీటితో పాటు ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్ FC అనే రెండు కొత్త వేరియంట్‌లు కూడా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ. 6.99 లక్షలు(ఎక్స్ షోరూమ్)ఉండగా,ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 7.88 లక్షలు,ఎక్సైట్ FC వేరియంట్ ధర రూ. 8.24 లక్షలు,ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 8.78 లక్షలు..ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి వేరియంట్ ధర రూ. 9.14 లక్షలుగా ఉంది. ఈ కారు 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక బ్యాటరీ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. దీని క్లెయిమ్ పరిధి 230 కిలోమీటర్లు. అయితే అధికారిక మైలేజీ 170-180 వరకు ఉంటుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 42PS పవర్, 110Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 kW ఛార్జర్, 7.4kW AC ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ కారు..4 సీట్ల కాంపాక్ట్ కారు. ఇందులో LED లైటింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, కీలెస్ ఎంట్రీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu