Ad Code

రియల్‌మీ నుంచి GT 6 హ్యాండ్‌సెట్ ?


రియల్‌మీ త్వరలోనే మరో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను రియల్‌మీ ఇండియా విడుదల చేసింది. రియల్‌మీ నుంచి త్వరలో GT 6 స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ అనేక సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లలో కనిపించింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ లోనూ కనిపించింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 పైన పనిచేసే అవకాశం ఉంది. క్వాల్‌ కాం స్నాప్‌ డ్రాగన్ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు గరిష్ఠంగా 16GB ర్యామ్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా రియల్‌మీ GT 6 హ్యాండ్‌సెట్ 120W ఛార్జింగ్‌ సపోర్టుతో 5,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఏప్రిల్‌ 11న చైనాలో రియల్‌మీ GT నియో 6 SE స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 1.5k LTPO OLED 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS, స్నాప్‌ డ్రాగన్‌ 7+ జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W ఛార్జింగ్‌ సపోర్టుతో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.  ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. గేమింగ్‌ సహా ఇతర సమయాల్లో ఫోన్‌ వేడెక్కినప్పుడు VC కూలింగ్‌ సిస్టమ్‌ ద్వారా హ్యాండ్‌సెట్‌ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 45W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ పూర్తి చేయవచ్చని సంస్థ తెలిపింది. రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 35 గంటల కాలింగ్‌ లేదా 15 గంటలపాటు వీడియో స్ట్రీమింగ్‌ బ్యాకప్‌ను పొందుతుంది.

Post a Comment

0 Comments

Close Menu