నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఐక్యూ ప్రత్యేక సేల్ !


ఐక్యూ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్ల ప్రకటన చేసింది. గరిష్ఠంగా రూ.25 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఐక్యూ ఆన్‌లైన్‌ స్టోర్లు, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ Z9 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7200 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 44W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 50MP సోనీ IMX882 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సాధారణ ధర రూ.19,999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.2000 తగ్గింపుతో రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ  Z7 ప్రో  హ్యాండ్‌సెట్ కర్వడ్‌ డిజైన్‌ సహా కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 66W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. కేవలం 22 నిమిషాల్లో 1-50 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చు. ఈ ఫోన్‌ ధర రూ.23999 గా ఉంది. ఆఫర్‌లో భాగంగా రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ నియో 7 ప్రో ఫోన్‌ సాధారణ ధర రూ.34,999 గా ఉంది. ఐకూ వార్షిక ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్‌ 8+ జెన్‌ 4 చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. ఐకూ నియో 9 ప్రో  హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. 8GB, 12GB ర్యామ్‌ మరియు 128GB, 256GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 50MP +8MP వెనుక కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ప్రీమియం లెధర్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.32,999 కే కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.64999కు విడుదలైంది. ఐకూ నాలుగో వార్షికోత్సవ సేల్‌లో భాగంగా రూ.41999 కే కొనుగోలు చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP OIS+ 8MP+ 13MP వెనుక కెమెరాలతోపాటు అమర్చారు. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఐక్యూ 12 స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌, 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP+64MP+50MP వెనుక కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 12GB, 16GB ర్యామ్‌ మరియు 256GB, 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ధర రూ.52999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.3 వేల తగ్గింపుతో రూ. 49999 కే కొనుగోలు చేయవచ్చు.

Post a Comment

0 Comments