ఇంట్లోనే కూర్చొని క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఆధార్ ఏటీఎం సర్వీసు సౌకర్యాన్ని అందిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' ఐపీపీబీ పోస్టు ప్రకారం.. 'అత్యవసర నగదు అవసరం పడిందా? బ్యాంకుకు వెళ్లే సమయం లేదా? అయితే, చింతించకండి. ఆధార్ ఏటీఎం సర్వీసుతో మీ ఇంటి నుంచే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకోవడానికి మీకు సాయం చేస్తాడు. ఏఈపీఎస్ సౌకర్యం ద్వారా బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ఆధార్‌ను గుర్తింపుగా ఉపయోగించవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేయడం, నగదు ఉపసంహరణ, వ్యాపార కరస్పాండెంట్ ద్వారా చెల్లింపులు వంటి ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఏఈపీఎస్ కింద అందుబాటులో ఉన్న సేవల్లో భాగంగా కస్టమర్ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ టు ఆధార్ చేయవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సూచనల ప్రకారం.. ఏఈపీఎస్ పొందాలనుకునే కస్టమర్ తప్పనిసరిగా (AePS)లో పాల్గొనే బ్యాంక్‌తో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇతర బ్యాంక్‌లో కూడా ఆధార్‌ను ఆ అకౌంట్‌తో లింక్ చేయాలి. కస్టమర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మాత్రమే ఉపయోగించి లావాదేవీ పూర్తి చేయగలరు.
0 Comments