లైంగిక దోపిడీపై పోరాటానికి, యువత రక్షణ కోసం కొత్త టూల్‌ను ప్రవేశడుతున్నామని ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. డైరెక్ట్ మెసేజ్ కింద నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమెటిక్‌గా బ్లర్ చేస్తుందని వెల్లడించింది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా తాము కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని, టీనేజ్ వారిని నేరస్థులు సంప్రదించడం కఠినతరం చేస్తున్నామని వెల్లడించింది. లైంగిక దోపిడీలో భాగంగా నేరస్థులు డైరెక్ట్ మెసేజ్ మార్గంలో నగ్నచిత్రాలు పంపేలా అవతలి వారిని ఒప్పిస్తారు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే లేదా లైంగిక పరమైన అంశాల్లో తాము చెప్పినట్లు వినకుంటే వాటిని ఆన్లైన్లో ఉంచుతామని బెదిరిస్తారు. స్కామర్లు చాలా సందర్భాల్లో 'సన్నిహిత చిత్రాలు' పొందేందుకు డైరెక్ట్ మెసేజ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, అయితే డైరెక్ట్ మెసేజ్ నగ్నత్వ రక్షణ సదుపాయాన్ని తాము పరీక్షిస్తున్నామని ఇన్స్టాగ్రామ్ తెలిపింది. ఎవరైనా డైరెక్ట్ మెసేజ్‌లో నగ్న చిత్రాలను పంపితే ఈ ఫీచర్ వాటిని బ్లర్ చేస్తుందని వివరించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్నచిత్రాలు పంపితే 'బ్లర్' చేసే టూల్ ?
by Telugu Lo Computer at April 12, 2024
Labels:
instagram
,
science
,
technology
,
ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా
,
ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్నచిత్రాలు పంపితే 'బ్లర్' చేసే టూల్ ?
,
లైంగిక కుంభకోణాలు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment