ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ గత సంవత్సరం ఆగస్టులో 4 మెట్రిక్+ SUV సెగ్మెంట్లోకి సిట్రోయెన్ C3 ఎయిక్క్రాస్ ద్వారా ప్రవేశించింది. డిజైన్ సహా ఇతర లుక్స్‌తో ఆకట్టుకుంది. డైవింగ్ అనుభూతి, టర్బో పెట్రోల్ ఇంజిన్ పనితీరుతో ఆకట్టుకుంది. గత సంవత్సరం విడుదల సమయంలో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, తేలికపాటి క్లచ్‌తో అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ వాహనం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. C3 ఎయిర్‌క్రాస్‌లో ఆటోమేటిక్ వెర్షన్‌ను మాత్రమే సిట్రోయెన్ తీసుకొచ్చింది. దీనిలో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చింది. ఈ గేర్‌బాక్స్‌ను జపాన్‌కు చెందిన Aisin నుంచి తీసుకుంది. ఈ ఆటోమేటిక్ వెర్షన్ 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ గత మోడల్ కంటే 15Nm టార్క్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఈ ఇంజిన్ గరిష్ఠంగా 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 108.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్లో చేసిన మార్పుల కారణంగా సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ బరువు 34 కేజీలు పెరిగింది. ఈ గేర్‌బాక్స్ మినహా సెట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతోపాటు ఆటోమేటిక్ వేరియంట్‌ను గుర్తించే విధంగా సెట్రోయెన్ ఎటువంటి చిహ్నాలు కారుపై ముద్రించలేదు. కారు లోపలి భాగాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్‌గా గుర్తించవచ్చు.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ డిజైన్ ఇంజిన్ !
by Telugu Lo Computer at January 29, 2024
Labels:
automobile
,
Citroen C3 Aircross Automatic Design Engine
,
engine produces a maximum torque of 205Nm. and produces 108.4 bhp of power
,
science
,
technology
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment