మోటో G54 5G స్మార్ట్‌ఫోన్ గత సెప్టెంబర్‌లో దేశంలో లాంచ్ అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.15,999గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.3000 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.15,999గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉండేది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే రేట్‌ను కలిగి ఉంటుంది. 6000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్ సహా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G54 5G స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ (8GB ర్యామ్ +128GB) ధర రూ.13999గా ఉంది అదే 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మై UX 5.0 పైన పనిచేస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC చిప్ సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz డైనమిక్ రిప్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) ఫీచర్‌తో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. IP52 రేటింగ్‌తో వస్తుంది.
0 Comments