టీసీఎల్ క్యూడీ టీవీ సీ755 పేరుతో ఈ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నాలుగు స్క్రీన్ సైజ్‌లతో కూడిన వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో IQ ఫార్మాట్‌లో డాల్బీ విజన్ సపోర్ట్, 6000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఈ టీవీ స్క్రీన్ రిజల్యూషన్ విషయానికొస్ 3840 x 2160 పిక్సెల్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 16:09 యాస్పెక్ట్ రేషియోను అందించారు. ఇక ఈ టీవీ స్క్రీన్ గరిష్టంగా 550 బ్రైట్ నిట్‌ను అందిస్తుంది. అలాగే.. HDR10 ప్లస్ సర్టిఫికేషన్‌తో తీసుకొచచారు. ఈ 4K టీవీలో 96% DCI P3 కలర్ గ్యామట్‌ను అందించారు. ఈ స్మార్ట్ టీవీలో క్వాంటం డాట్ టెక్నాలజీని అందించారు. క్వాంటం డాట్ టెక్నాలజీ సహాయంతో, టీవీలో బిలియన్ కంటే ఎక్కువ కలర్ కాంబినేషన్‌లను చూడొచ్చు. ఈ స్మార్ట్ టీవీలో AiPQ ప్రాసెసర్ 3.0 చిప్‌సెట్‌ని అందించారు. గూగుల్ టీవీతో పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్, ఐమ్యాక్స్ వంటి పీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో 10 వాట్స్‌తో కూడిన రెండు అవుట్‌పుట్ స్పీకర్‌లను, 20 వాట్స్‌తో కూడిన మరొక స్పీకర్‌ను అందించారు. డాల్బీ ఆటమ్స్, డీటీఎస్ హెచ్‌డీ, డీటీఎస్ వర్చువల్ ఎక్స్, 2.1 ఛానెల్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2, Wi-Fi 6, AMD ఫ్రీసింక్ ప్రీమియం ప్రో వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈ టీవీల మొత్తం 3 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లను అందించారు. ఈ టీవీ బేస్ మోడల్ 55 ఇంచెస్ ధర రూ. 74,990గా ఉంది. ఇక 65 ఇంచెస్ మోడల్ ధర రూ. 99,990కాగా, 75 ఇంచెస్ టీవీ ధర రూ. 1,59,990గా ఉంది. అలాగే హై ఎండ్ అయిన 98 ఇంచెస్ టీవీ ధర ఏకంగా రూ. 4,09,990గా నిర్ణయించారు. అయితే 85 ఇంచెస్ టీవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు.
0 Comments