ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను తెరిచి ప్రొఫైల్‌కి వెళ్ళండి. కుడి ఎగువ మూలలో ఉన్న మూడు లైన్స్‌ను ఎంచుకోవాలి. సెట్టింగ్‌లు, గోప్యత ఎంపికను ఎంచుకుని, అకౌంట్స్ సెంటర్ ఎంపికను తీసుకొని, వ్యక్తిగత వివరాలను ఎంచుకోవాలి. ఖాతా యాజమాన్యం, నియంత్రణ ఎంపికను ఎంచుకుని, క్రియారహితం లేదా తొలగింపును నొక్కాలి. అనంతరం మీరు శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న లేదా తాత్కాలికంగా డియాక్టివేట్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోవాలి. మీ ఖాతాతో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. తొలగించండి లేదా నిష్క్రియం చేయండి అనే ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ నుంచి అయితే ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరవాలి. అనంతరం మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. ఖాతా తెరిచిన తర్వాత దిగువ ఎడమ మూలలో ఉన్న మూడు లైన్స్‌ను ఎంచుకోవాలి. అనంతరం సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి. ఖాతాలను ఎంచుకుని, ఆపై వ్యక్తిగత వివరాల ఎంపికను ఎంచుకోవాలి. ఖాతా యాజమాన్యం, నియంత్రణను క్లిక్ చేయాలి. అనంతరం డియాక్టివేషన్ లేదా తొలగింపును ఎంచుకోవాలి. మీరు తొలగించాలనుకుంటున్న లేదా డియాక్టివేట్ చేయాలనుకుంటున్న ఖాతాను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ ఖాతాతో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. తొలగించండి లేదా నిష్క్రియం చేయండి. లేదా కొనసాగించు ఎంచుకుంటే ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.
0 Comments