Ad Code

చంద్రుని దక్షిణ ధ్రువంపై భారీ ప్రకంపనలు ?


మెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటికే చంద్రునిపై అనేక ప్రయోగాలను చేపట్టింది. చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఆర్టెమిస్-3 మిషన్‌ను నాసా 2026 ప్రయోగిస్తామని వెల్లడించింది. గతంలో 1972లో నాసా అపోలో 17 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్ ద్వారానే ఇప్పుడు జాబిల్లిపైకి మనుషులను పంపనుంది. అయితే ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఆ జర్నల్ ఇప్పుడు నాసాకు సవాల్‌గా మారింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై భారీ ప్రకంపనలు సంభవించాయి. దీంతో పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తేల్చి చెప్పారు. చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని, అక్కడ చాలా భాగం వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూలంగా లేదని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ చంద్రుడు కుంచించుకుపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరించారు.


Post a Comment

0 Comments

Close Menu