Ad Code

వాట్సాప్ iOS బీటా యూజర్ల కోసం ఛానల్స్‌లో పోల్స్‌ ?


వాట్సాప్ iOS బీటా యూజర్ల కోసం ఛానల్స్‌లో పోల్స్‌ను పరీక్షిస్తోందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో రిపోర్ట్.  లేటెస్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ 24.1.10.76లో పోల్స్ ఫీచర్ కనిపించినట్లు వాట్సాప్‌ బీటా ఇన్ఫో రిపోర్టు వెల్లడించింది. ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు గత వారం ఈ ఫీచర్‌ రిలీజ్ అయింది. క్రియేట్,ఎడిట్ చేసే ప్రాసెస్ వాట్సాప్ ఛానల్స్‌లో పోల్స్‌ స్పెసిఫికేషన్‌తో ఓనర్లు, అడ్మిన్లు ఫాలోవర్లను ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్న కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి సింపుల్, క్రిస్టల్ క్లియర్ వేలో రెస్పాన్స్‌లు పొందవచ్చు. పోల్‌కు ప్రత్యేకంగా ఎవరు కాంట్రిబ్యూట్ చేశారో తెలియకుండానే పార్టిసిపెంట్లు మొత్తం ఓట్ల సంఖ్యను చూడగలరు. ఇంతకీ ఛానల్‌లో పోల్‌ను ఎలా క్రియేట్ చేయాలి? అన్న విషయానికి వస్తే.. ఛానల్‌లో పోల్‌ను క్రియేట్ చేయడానికి, చాట్ అటాచ్‌మెంట్ మెనూ ఓపెన్ చేసి, పోల్ ఆప్షన్ ఎంచుకోవాలి. మల్టిపుల్ ఆన్సర్స్‌ను అనుమతించాలా లేదంటే సింగిల్ ఆన్సర్ మాత్రమే ఇచ్చేలా ఓటర్లను అనుమతించాలా అనేది సెలక్ట్ చేసుకోవచ్చు. పోల్స్‌ అనానిమస్ గా ఉంటాయి. అంటే ఎవరు దేనికి ఓటు వేశారో ఛానల్ క్రియేటర్లు చూడలేరు. దీనివల్ల ఓటర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి ఎలాంటి భంగం వాటిల్లదు. ఫాలోవర్లు అభిప్రాయాలను, ప్రాధాన్యతలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు. వాట్సాప్‌ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌కు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది. ఈ లింక్‌ https://wabetainfo.com/wp-content/uploads/2024/01/WA_CHANNEL_POLL_SHARING_FEATURE_IOS-scaled.jpg పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ ఛానల్‌లో ఎలా పోల్ పనిచేస్తుందో చూడవచ్చు. కొంతమంది బీటా టెస్టర్లు సొంత ఛానల్స్‌లోనే ఈ కొత్త పోల్ ఆప్షన్ చెక్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu