రివోల్ట్ మోటార్స్ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్ పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచింది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా రివోల్ట్ షోరూమ్‌లలో బైక్‌ను బుక్ చేసుకోవచ్చని రివోల్ట్ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.38 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ ఎలిప్స్ రెడ్, కాస్మిక్ బ్లాక్, మిస్ట్ గ్రే, ఇండియా బ్లూ, స్టెల్త్ బ్లాక్, లైటింగ్ ఎల్లో రంగుల్లో లభిస్తుంది. ఇందులో 2.24 కేడబ్ల్యూహెచ్ లిథియం బ్యాటరీ 3కేడబ్ల్యూ మిడ్ డ్రైవ్ మోటార్‌ను ఇచ్చారు. 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే బ్యాటరీ ఫుల్ కావడానికి 4.3 గంటలు పడుతుంది. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా దూసుకుపోతుంది. అయితే ఇది ఎకో మోడ్‌లో మాత్రమే. తక్కువ స్పీడ్‌తో వెళితే 150 కిమీల రేంజ్ ఇస్తుందని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళితే 100 కి.మీలు, 85 కిలోమీటర్ల వేగంతో వెళితే.. 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్, సైడ్-స్టాండ్ కటాఫ్, స్పీడ్, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్, వెదర్‌ను చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో అందించారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ 3 గంటల్లో 0 నుంచి 75 శాతం ఛార్జింగ్ అవుతుంది. అలాగే ఇందులో హెక్జాగోనల్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌ను ఇచ్చారు. డిజిటల్ ఇస్ట్రుమెంట్ కన్జోల్, డ్యూయల్ టోన్ బాడీ వర్క్, సింగిల్ పీస్ సీట్‌ను అందించారు.
0 Comments