Ad Code

ఇన్‌స్టాలో రీ ఎడిట్‌ ఫీచర్‌ !


న్‌స్టాగ్రామ్‌ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాస్తవానికి చాలా మెసేజింగ్‌ యాప్స్‌లో ఇప్పటికే ఉన్నదే ఈ ఫీచర్‌. అదేంటంటే మనం ఇన్‌స్టాలో పంపిన మెసేజ్‌ను రీ ఎడిట్‌ చేసుకొనే వెసులుబాటు ఇన్‌బిల్ట్‌గా వచ్చింది. సాధారణంగా సోషల్‌ మీడియాలో ఎవరికైనా మెసేజ్‌ పంపిస్తే దానిలో ఏదైనా అక్షరం, లేదా పదం తప్పుగా టైప్‌ అయ్యిందనుకోండి.. అలాగే వెళ్లపోతే దానిని తిరిగి ఎడిట్‌ చేసుకోవడం కుదరదు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ (డీఎం) ద్వారా పంపిన మెసేజ్‌ ను ఎడిట్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. అంతేకాక మీరు ఎడిట్‌ చేశారు అన్న విషయం కూడా అవతలి వ్యక్తికి తెలియకుండా దానిని చేయొచ్చు.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌గా అందుబాటులో ఉంది. అయితే ఇది రెండు ఫీచర్లను కలపడం ద్వారా సాధ్యమవుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయాలంటే ఈ స్టెప్‌ బై స్టెప్‌ గైడ్‌ ను వినియోగించండి. ఇన్‌గ్రామ్‌లో తప్పు సందేశాన్ని పంపిన చాట్ విండోకు వెళ్లండి. ఆ తర్వాత, ఆ మెసేజ్‌పై ట్యాప్‌ చేసి, లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. తర్వాత దానిని కాపీ చేయాలి. ఆపై దాన్ని డిలీట్‌ చేయండి. అయితే అలా మెసేజ్ డిలీట్ అయిన విషయం మీరు మెసేజ్‌ సెండ్‌ చేసిన వ్యక్తికి తెలియదు. అదే వాట్సాప్‌ వంటి ఇతర మెసేజింగ్‌ యాప్స్‌లో డిలీట్‌ చేస్తే అవతలి వ్యక్తికి కూడా తెలిసిపోతుంది. కానీ ఇన్‌స్టాలో తెలీదు. దీని తర్వాత, కాపీ చేసిన మెసేజ్‌ను చాట్ బాక్స్‌లో పేస్ట్‌ చేయచండి. మీ తప్పును సరిచేసి మళ్లీ పంపండి. ఈ విధంగా, సందేశం సవరించబడిందని లేదా తొలగించబడిందని సూచించే నోటిఫికేషన్ ఏదీ అవతలి వారికి ఉండదు. అయితే మీరు ఆ మెసేజ్‌ ను వారు చూడక ముందే డిలీట్‌ చేసి సరిచేయాలి. ఒక్కసారి వారు చూస్తే ఇది చేయడం వీలు పడదు. ఇన్‌స్టాగ్రామ్ మీరు పంపిన సందేశాన్ని తొలగించగల సమయ ఫ్రేమ్‌ని పరిమితం చేస్తుందని కూడా గమనించడం ముఖ్యం. కాబట్టి, దానిని గుర్తుంచుకోండి.

Post a Comment

0 Comments

Close Menu