Ad Code

యూట్యూబ్‌ ఇండియాకు సమన్లు !


యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియో లను పోస్ట్‌ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై సమాధానం చెప్పాలంటూ యూట్యూబ్‌ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు భారత్‌లోని యూట్యూబ్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ మీరా ఛాట్‌కు.. కమిషన్‌ లేఖ రాసింది. అసభ్యకర కంటెంట్‌ను తమ మాధ్యమం నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. సమన్లకు స్పందించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Post a Comment

0 Comments

Close Menu