గూగుల్ తాజా లేఆఫ్స్‌లో భాగంగా ఏకంగా వెయ్యి మందిని విధుల నుంచి తొలగించినట్లు ఈ సెర్చింజన్ దిగ్గజం పేర్కొంది. గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో కొలువులకు కంపెనీ కోత పెట్టింది. లేఆఫ్స్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోయింనందుకు బాధపడుతున్నాం.. ఈ కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని బాధిత ఉద్యోగులకు గూగుల్ కంపెనీ ఈమెయిల్‌లో తెలిపింది. అర్హులైన ఎంప్లయ్స్ కు పరిహార ప్యాకేజ్ వర్తింప చేస్తామని గూగుల్ తెలియజేసింది. ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి దరఖాస్తు చేసుకోచ్చని తెలిపింది. కంపెనీలో తిరిగి ఛాన్స్ దక్కని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వదిలి పెట్టాలని చెప్పింది. ఇక, 2023లోనే పలు టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికాయి.
0 Comments