ఫిలిప్పీన్స్ లో రియల్ మీ మొదటి నోట్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ నోట్ 50 ని లాంచ్ చేసింది. రియల్మీ లాంచ్ చేసిన మొదటి నోట్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఇదే. 6.74 అంగుళాల డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. గతేడాది లాంచ్ అయిన రియల్ మీ సీ51 తరహాలోనే ఇందులో కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఈ ఫోన్ ధరను ఫిలిప్పీన్స్ లో 3,599 ఫిలిప్పీన్స్ పెసోలుగా (సుమారు రూ.6,000) నిర్ణయించారు. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. మిడ్ నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో మన దేశంలో కూడా లాంచ్ కానుంది. రియల్ మీ వైస్ ప్రెసిడెంట్ కీ ఛేజ్ మాట్లాడుతూ వియత్నాం, థాయ్ల్యాండ్, ఇటలీ, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లో కూడా ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్ మీ యూఐ టీ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్ గా ఉంది. పీక్ బ్రైట్నెస్ 560 నిట్స్ గా ఉంది. దీని పిక్సెల్ డెన్సిటీ 260 పీపీఐ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 90.3 శాతంగా ఉండనుంది. సెల్ఫీ కెమెరా కోసం ముందువైపు వాటర్ డ్రాప్ తరహా నాచ్ను అందించారు. యూనిసోక్ టీ612 ప్రాసెసర్పై రియల్మీ నోట్ 50 రన్ కానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఫోన్ వెనక వైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్ , జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.
0 Comments