దేశీయ మార్కెట్లో టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో టెక్నో స్పార్క్ 20, టెక్నో స్పార్క్ 20 ప్రో, టెక్నో స్పార్క్ 20 ప్రో + ఫోన్లు ఉంటాయి. గత నెలలో సెలెక్టెడ్ మార్కెట్లలో టెక్నో స్పార్క్ 20 టెక్నో స్పార్క్ 20 ప్రో ఆవిష్కరించింది. రెండు కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు వస్తున్నాయని తెలుస్తున్నది. `ఫ్లాగ్‌షిప్ బ్యాటరీ, ప్రీమియం డిజైన్`తో టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు ఉంటాయని సమాచారం. గ్లోబల్ మార్కెట్లలో టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు నియాన్ గోల్డ్, గ్రావిటీ బ్లాక్ కలర్‌వేస్‌లో ఆవిష్కరించింది టెక్నో. ఈ ఫోన్లు వచ్చేనెల మొదటి వారంలోనే భారత్ మార్కెట్‌లోకి ఎంటర్ కానున్నాయి. నియాన్ గోల్డ్, గ్రావిటీ బ్లాక్ కలర్‌వేస్‌తోపాటు సైబర్ వైట్, మ్యాజిక్ స్కిన్ 2.0 (బ్లూ) కలర్స్‌లోనూ ఈ ఫోన్లు రానున్నాయి. టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు 256 జీబీ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తుందని తెలుస్తున్నది. టెక్నో స్పార్క్ 20 సిరీస్ ఫోన్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరకు రూ.10 వేల నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ వర్గాల కథనం. టెక్నో స్పార్క్ (Tecno Spark 20) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంటుందని చెబుతున్నారు. మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ హెచ్ఐఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. టెక్నో స్పార్క్ 20 ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఎఫ్/1.6 అపెర్చర్, అన్ స్పెసిఫైడ్ 0.8 మెగా పిక్సెల్ యాక్సిలరీ లెన్స్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎఫ్ఎం రేడియో కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. ఇక 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
0 Comments