Ad Code

ట్రాయ్‌ పేరుతో సందేశాలు తస్మాత్ జాగ్రత్త !


టెలికాం రెగ్యులేటర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) పేరుతో ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ట్రాయ్‌ పేరుతో ఇటీవల స్మార్ట్‌ ఫోన్‌లకు సైబర్ నేరగాళ్లు కొన్ని రకాల మెసేజ్‌లను  పంపిస్తున్నారు. మీ మొబైల్ నెంబర్‌ కేవైసీ చేసుకొని నేపథ్యంలో మీ ఫోన్‌ నెంబర్‌ డియాక్టివేట్ అవుతుందని మెసేజ్‌ను పంపిస్తున్నారు. కేవైసీని పూర్తి చేసుకోవడానికి ఓ యూఆర్‌ఎల్‌ లింక్‌ను పంపుతున్నారు. పొరపాటున ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే స్మార్ట్‌ ఫోన్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యూజర్లను హెచ్చరిక జారీ చేసింది. ట్రాయ్‌ ఎప్పుడూ ఇలాంటి సందేశాలను పంపించదని, కేవైసీకి సంబంధించి ట్రాయ్‌ ఎలాంటి సందేశాలు కానీ కాల్ కానీ చేయదని అధికారులు తెలిపారు. ట్రాయ్‌ పేరుతో వచ్చన సందేశాలకు రెస్పాండ్‌ కాకూడదని తెలిపారు. పొరపాటున కూడా తెలియని లింక్‌లను క్లిక్‌ చేయ్యవద్దని సూచిస్తున్నారు. దీంతో పాటు నేరగాళ్లు మొబైల్‌ నెంబర్‌ డీయాక్టివేట్ అవుతున్నాయని నమ్మిస్తూ స్కైప్‌ వంటి వాటి ద్వారా వీడియో కాల్స్‌ చేస్తూ మోసం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ట్రాయ్‌ పేరుతో ఎలాంటి మోసపూరిత మెసేజ్‌లు కానీ కాల్స్‌ వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌ వస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.inకి ఫిర్యాదుల చేయాలని చెబుతున్నారు. అలాగే.. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu