మెటా సంస్థ తన ఆదాయ మార్గాలను ప్రోత్సహిస్తూనే చిన్నారులు, టీనేజర్లు చూస్తున్న కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. గంటల సమయంలో సోషల్ మీడియాలోనే గడపడం సహా తప్పుదారి పట్టించే కంటెంట్ కారణంగా తమ చిన్నారులు దారితప్పుతారన్న తల్లిదండ్రుల ఆందోళనను మెటా సంస్థ పరిగణనలోకి తీసుకుంది. చిన్నారులు, టీనేజర్లు తమ వయస్సుకు తగ్గ కంటెంట్‌ను మాత్రమే చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఎక్కువ సమయం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో గడపకుండా ఈ ఫీచర్ నియంత్రించనుంది. నైట్‌టైం నడ్జెస్ పేరుతో ఈ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. అత్యధిక శాతం మంది యూజర్ల రీల్స్ చూస్తూ ఇన్‌స్టాలోనే గడిపేస్తున్నారు. పగటి పూట సహా అర్ధరాత్రి వేళల్లోనూ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఈ ప్రవర్తన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నైట్‌టైం నడ్జెస్ ఫీచర్ అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో అదే పనిగా 10 నిమిషాల పాటు గడిపినప్పుడు ఓ అలెర్ట్‌ను జారీ చేసింది. మీరు పరిమితికి మించి ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపారు, కాబట్టి యాప్‌ను క్లో్జ్ చేయమని హెచ్చరిస్తున్నట్లు ఓ అలెర్ట్‌ను ఈ ఫీచర్ జారీ చేయనుంది. ఈ అలెర్ట్‌తో వారి నిద్ర సమయాన్ని గుర్తుచేసినట్లు ఉంటుందని, ఫలితంగా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి నిద్రపోయే అవకాశం ఉంటుందని మెటా సంస్థ భావిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కారణంగా టీనేజర్లు సహా ఇతరులు నిద్రకు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు సహా కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గడిపే సమయంలో రోజురోజుకు పెరిగిపోతోంది. గతంలో ఆటల స్థలాల్లో ఎక్కువ కాలం గడిపిన చిన్నారులు సైతం ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ఇది యాజర్ల మానసిక స్థితి, ఆరోగ్యం, కళ్లు సహా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మెటా సహా ఇతర సోషల్ మీడియా వేదికలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
0 Comments