దేశీయ మార్కెట్లోకి ఒప్పో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 11 ను ఇటీవల విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పుల్ HD+ డిస్‌ప్లేతో మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSపై పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. 1080*2412 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డ్యూయల్ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ColorOS 14 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందనుంది. రెనో 11 స్మార్ట్‌ఫోన్ ఆక్టో కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్.. 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఒప్పో హ్యండ్‌సెట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, f/2.0 అపేచర్‌తో 32MP టెలిఫోటో కెమెరాని కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. అదే 256GB వేరియంట్ రూ.31,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వేవ్ గ్రీన్, రాకీ గ్రే రంగుల్లో లభిస్తోంది. దీనిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్టు మరియు ఇతర రిటైల్ దుకాణాల్లోను కొనుగోలు చేయవచ్చు.
0 Comments