Ad Code

ఫిబ్రవరిలో హానర్ ఎక్స్ 9బీ విడుదల !


దేశీయ మార్కెట్లోకి హానర్ నుంచి సరికొత్త ఫోన్ ఎక్స్9బీ ఫిబ్రవరిలో రాబోతోంది. గత ఏడాదిలో ఎంపిక చేసిన అరబ్ దేశాలలో హానర్ ఎక్స్9బీని ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 35డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,800ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ ఫిబ్రవరి 8 లేదా ఫిబ్రవరి 9న దేశంలో లాంచ్ కానుంది. దీని ధర రూ. 25వేల నుంచి రూ. 30వేల మధ్య ఉండనుంది.  హానర్ ఎక్స్9బీ మోడల్ హానర్ చాయిస్ ఎక్స్5 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్  బండిల్ రూ. 35వేల లోపు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హానర్ ఎక్స్9బీ మోడల్ భారతీయ వేరియంట్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా  7.2తో వస్తుంది. స్పాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఈసీతో 12జీబీ ర్యామ్‌తో రన్ అవుతుంది. హానర్ ఎక్స్9బీ ఫోన్ ఇప్పటికే యూఏఈలో 8జీబీ ర్యామ్ + 256జీబీ, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్OS 7.2పై రన్ అవుతుంది. 6.78-అంగుళాల 1.5కె (1,200×2,652) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. దీంతో పాటు గరిష్టంగా 12జీబీ ర్యామ్ కూడా ఉండనుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 35డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,800ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu