దేశీయ మార్కెట్లోకి కైనెటిక్ గ్రీన్ నుంచి జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఇది రూ. 94,990 ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. వినియోగదారులు అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. జులూ ఇ-స్కూటర్ స్వదేశంలోని తయారు చేయగా బ్యాటరీతో విక్రయిస్తున్నట్టు ఈవీ తయారీదారు ధృవీకరించింది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, ఆటో-కట్ ఛార్జర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి మరిన్నింటిని కలిగి ఉంది. 160మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో, జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌ల వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. కైనెటిక్ గ్రీన్ జులూ ఇ-స్కూటర్ 1,830మిమీ పొడవు, 1,135 మిమీ ఎత్తు, 715 మిమీ వెడల్పు కలిగి ఉంటుంది. 1,360మీమీ వీల్‌బేస్, 93 కిలోల కర్బ్ వెయిట్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. జూలు ఇ-స్కూటర్‌కు శక్తినిచ్చే 2.27kWh బ్యాటరీ, ఛార్జ్‌కి 104 కిమీల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. 2.1కెడబ్ల్యూ బీఎల్డీసీ హబ్ మోటార్‌తో అమర్చి గంటకు 60కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. ఈవీ స్కూటర్లో సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టమ్ యువ రైడర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్రంట్ ఫోర్క్స్, అరుదైన డ్యూయల్ షాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా కైనెటిక్ గ్రీన్ ఈ కొత్త జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది.
కైనెటిక్ గ్రీన్ నుంచి జులూ ఎలక్ట్రిక్ స్కూటర్ !
by Telugu Lo Computer at December 11, 2023
Labels:
automobile
,
electric scooter
,
science
,
technology
,
ఆటో-కట్ ఛార్జర్
,
ఎల్ఈడీ డీఆర్ఎల్
,
ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్
,
కైనెటిక్ గ్రీన్ నుంచి జులూ ఎలక్ట్రిక్ స్కూటర్
,
డిజిటల్ స్పీడోమీటర్
,
సైడ్ స్టాండ్ సెన్సార్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment