అంతర్జాతీయ మార్కెట్‌లో నోకియా 50-అంగుళాల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో 24-అంగుళాల, 32-అంగుళాల, 40-అంగుళాల మరియు 43-అంగుళాల నోకియా స్మార్ట్ టీవీలను ప్రారంభించిన తరువాత, ఇప్పుడు 50-అంగుళాల 4K స్మార్ట్ టీవీని విడుదల చేశారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD డిస్‌ప్లేతో వస్తుంది. 3840 x 2160 పిక్సెల్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ Nokia TV HDR10 సపోర్ట్ మరియు డాల్బీ విజన్‌తో సహా వివిధ డిస్‌ప్లే ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఈ టీవీలో వివిడ్ కలర్స్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీ మీకు థియేటర్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. ఇది ARM కార్టెక్స్-CA55 క్వాడ్-కోర్ CPU మరియు Mali 470 MP3 GPU గ్రాఫిక్స్ కార్డ్‌ను కూడా కలిగి ఉంది. కార్టెక్స్ -CA55 క్వాడ్-కోర్ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ కొత్త నోకియా స్మార్ట్ టీవీ ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించబడింది. స్ట్రీమ్‌వ్యూ కంపెనీ ఈ టీవీ సాఫ్ట్‌వేర్ నిర్మాణం మరియు డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించింది. 1GB RAM మరియు 8GB స్టోరేజీ కలిగి ఉంది. నోకియా 50-అంగుళాల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు TDS సౌండ్ సపోర్ట్‌తో రెండు 10-వాట్ స్పీకర్‌లతో వస్తుంది. కాబట్టి ఈ టీవీ అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుంది. నోకియా 50-అంగుళాల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ టీవీలో అన్ని యాప్‌లను సజావుగా ఉపయోగించుకోవచ్చు. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్ మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ మద్దతుతో సహా అనేక రకాల అధునాతన ఫీచర్‌లతో కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ మరియు యూట్యూబ్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సేవలను అందిస్తుంది. ఇది కాకుండా, గూగుల్ ప్లే స్టోర్ నుండి 7000 యాప్‌లను ఈ టీవీలో ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. మరియు ఈ స్మార్ట్ టీవీ కూడా స్మార్ట్ రిమోట్‌తో వస్తుంది. ముఖ్యంగా OTD సైట్‌ల షార్ట్‌కట్ బటన్‌లు ఈ రిమోట్‌లో ఉన్నట్లు నివేదించబడింది. 4 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, ఈథర్నెట్ LAN పోర్ట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 4.2 వంటి వివిధ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ టీవీ బరువు 9 కిలోలు. ప్రస్తుతం ఈ టీవీ అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే లాంచ్ చేయబడింది.
0 Comments