జియో వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ ను అనౌన్స్ చేసింది. రూ. 148 రూపాయలకే 12 OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా హై స్పీడ్ డేటాని కూడా అందిస్తోంది. రూ. 148 ప్లాన్ తో 28 రోజుల JioCinema Premium సబ్ స్క్రిప్షన్ అందుతుంది మరియు ఈ కూపన్ MyJio అకౌంట్ లో క్రెడిట్ చేయబడుతుంది. దీనితో, జియో టీవీ యాప్ ద్వారా Liongate Play, Discovery+, Sun NXT, Sony LIV, ZEE5, JioCinema Premium, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi యాప్ లకు ఉచిత షబ్ స్క్రిప్షన్ అందుతుంది. ఈ ప్లాన్ తో పూర్తిగా 28 రోజుల కాలానికి గాను 10 GB ల హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంటే, కేవలం 148 రూపాయలకే ఈ ప్లాన్ ద్వారా ప్రీమియం OTT యాప్స్ సబ్ స్క్రిప్షన్ తో పాటు డేటాని కూడా పొందవచ్చు. మరో జియో రూ. 398 ప్లాన్ లో 12 OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని, 4G నెట్ వర్క్ పైన డైలీ 2 GB డేటాని అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో 100 SMS/day సౌలభ్యం కూడా అందుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది.
రూ. 148 రూపాయలకే 12 OTT జియో సబ్ స్క్రిప్షన్ !
Thursday, December 21, 2023
Discovery+ jio JioCinema Premium Liongate Play ott science Sony LIV Sun NXT technology Zee5 రూ. 148 రూపాయలకే 12 OTT జియో సబ్ స్క్రిప్షన్ హై స్పీడ్ డేటాని కూడా
No comments:
Post a Comment