మోటోవోల్ట్ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యూఆర్బీఎన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 49,999. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 999 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. ఈ యూఆర్బీఎన్ ఈ-బైక్ కు జ్ వందకు పైగా ఫిజికల్ రిటైల్ పాయింట్లను ఏర్పాటు చేసింది. పసుపు, బ్లూ, రెడ్, ఆరెంజ్ రంగుల్లో ఇది లభిస్తుంది. మోటోవోల్ట్ యూఆర్బీఎన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బీఐఎస్ అప్రూవ్డ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఇంట్లోనే చార్జ్ చేసేసుకోవచ్చు. బైక్ ఇంటి బయట పార్క్ చేసుకొని, బ్యాటరీని ఇంట్లోకి తెచ్చుకొని చార్జ్ చేసుకోవచ్చు. దీనిలో పెడల్ అసిస్ట్ సెన్సార్ ఉంటుంది. ఇది పలురకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రైడ్ ప్రిఫరెన్స్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఇగ్నిషన్ కీ, హ్యాండిల్ లాక్ సేఫ్టీ ఉంటుంది.ఈ-బైక్ 1,700ఎంఎం పొడవు, 645ఎంఎం వెడల్పు, 1010ఎంఎం ఎత్తు ఉంటుంది. 40కేజీల బరువు ఉంటుంది. 120 కేజీల బరువను మోయగలుగుతుంది. యూఆర్బీఎన్ ఈ-స్కూటర్ కేవలం 10 సెకండ్ల లోపే గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. బ్యాటరీ లిథియం అయాన్ టైప్ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీని రేంజ్ సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్లు వస్తుంది. దీనిలో మోటార్ 36వోల్ట్స్ సామర్థ్యంతో ఉంటుంది. బీఎల్డీసీ రకం 20 అంగుళాల చక్రాలు ఉంటాయి. దీనిలోని మోటార్ 35ఎన్ఎం నుంచి 40ఎన్ఎం వరకూ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. సస్పెన్షన్ చూస్తే ముందు వైపు స్ప్రింగ్ యూనిట్స్, వెనుకవైపు హైడ్రాలిక్ కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇవి రైడర్ కు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సిటీ పరిధిలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఆడవారు కూడా ఇంటి అవసరాలను దీనిని వినియోగించుకోవచ్చు. లో స్పీడ్ స్కూటర్ కాబట్టి ఎటువంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉండదు.
లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని ఈ-స్కూటర్ !
by Telugu Lo Computer at December 30, 2023
Labels:
electric scooter
,
science
,
technology
,
మోటోవోల్ట్ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్
,
యూఆర్బీఎన్ ఎలక్ట్రిక్ స్కూటర్
,
రిజిస్ట్రేషన్ అవసరం లేని ఈ-స్కూటర్
,
లైసెన్స్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment