Ad Code

షావోమీ నుంచి ఎస్‌యూ7 కారు !


షావోమీ కార్ల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందని గతకొన్ని రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈరోజు చైనాలో జరిగిన షావోమీ ఈవీ టెక్నాలజీ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కారుకు షావోమీ ఎస్‌యూ7గా నామకరణం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్‌ లుక్‌లో ఈ కారును తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈవీ వాహనాల రంగంలో రానున్న రోజుల్లో అగ్రగామిగా రాణించాలన్నదే తమ లక్ష్యమని షావోమీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లీ జున్‌ తెలిపారు. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో ప్రపంచంలోని టాప్‌ 5 ఆటోమొబైల్ తయారీదారుల్లో ఒకరిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కారు తయారీ ప్రారంభమైంది. బీజింగ్‌లోని బీఏఐసీ అనే కార్ల తయారీ కంపెనీ షావోమీ కార్లను తయారు చేయనుంది. ఏడాదికి రెండు లక్షల కార్ల తయారీచేయగల కెపాసిటీ ఈ ప్లాంట్ సొంతం. ఈ కారు 4997 ఎమ్‌ఎమ్‌ పొడవు, 1963 ఎమ్‌ఎమ్‌ల వెడల్పు, 3000 ఎమ్‌ఎమ్ వీల్‌ బేస్‌తో రానుంది. షావోమీ ఎంట్రీ లెవల్‌ కారు 73.6 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇక టాప్‌ ఎండ్ విషయానికొస్తే 101 కేడబ్ల్యూహెచ్‌ కెపాసిటీగల బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ కార్లలో షావోమీ ప్రత్యేకంగా సెల్‌ టు బాడీ అనే టెక్నాలజీని తీసుకొస్తోంది. ఇక ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు నాన్‌ స్టాప్‌గా దూసుకుపోతుందని కంపెనీ చెబుతోంది. అలాగే క్యాబిన్‌ విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో క్యాబిన్‌ ఎత్తును తగ్గిస్తున్నారు. ఈ కారులో 21,000 ఆర్‌పిఎమ్ గరిష్ట రోటర్ వేగంతో వీ6, వీ6ఎస్‌లు భారీ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu