Ad Code

జనవరిలో టెక్నో స్పార్క్‌ 20 ప్రో ప్లస్‌ !

టెక్నో స్పార్క్‌ 20 ప్రో ప్లస్‌ ఫోన్‌ను జనవరిలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ తెలిపింది. టెక్నో స్పార్క్‌ 20 ప్రోకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్ లను అందిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా క్వాలిటీతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. కాగా టెక్నో స్పార్క్‌ 20 ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియా టెక్‌ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే విడుదల చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. వర్టికల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ యూనిట్‌ను అందించారు. ఇక ఈ ఫన్‌లో డబుల్‌ కర్వ్‌డ్‌ డిజైన్‌ను ప్రత్యేకంగా అందించారు. దీంతో యూజర్లు ఫోన్‌ను చాలా సౌకర్యవంతంగా పట్టుకునేందుకు వీలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. బెజ్‌లెస్‌ డిజైన్‌తో రూపొందించిన డిస్‌ప్లే ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. అలాగే సెంటర్డ్‌ పంచ్‌ హోల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నారు. అలాగే మెమోరీ కార్డుతో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఇకపోతే టెక్నో స్పార్క్‌ 20 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే.. అలాగే ఇందులో హాట్‌స్పాట్‌, బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ సీ పోర్ట్‌, హెడ్‌ ఫోన్‌ జాక్‌ వంటి ఫీచర్లను అందించారు. 

Post a Comment

0 Comments

Close Menu