చైనా రోడ్డుపై పరుగులు పెట్టే ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది, ఒకేసారి 100 మందిని తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ నగరంలో ప్రయాణించడం వల్ల సిటీ బస్సు మాదిరిగా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుండం వల్ల జీరో ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్య రహితమైన ట్రైన్ అని తెలుస్తోంది. ట్రాక్‌లెస్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ ట్రైన్ వేగంగా ప్రయాణించడమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్ పడితే ఆగుతుంది కూడా. ఇది ఆటోమాటిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల రూట్ బాగా ఫాలో అవుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఆపరేట్ అవ్వడానికి ప్రత్యేకమైన సెన్సార్ సిస్టం కలిగి ఉంటుంది. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
0 Comments