ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ మరోసారి స్తంభించింది. ఒక్కసారిగా ఆఫ్‌లైన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోవడంతో భారీ పెద్ద అంతరాయం కలిగింది. చాట్‌జీపీటీ అంతరాయం కారణంగా వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే, అర్ధగంటకు పైగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ ఎట్టకేలకు ఆన్‌లైన్‌లోకి వచ్చింది. అయితే, ఎదురైన చాట్ జీపీటీలోని సాంకేతిక సమస్యను పరిష్కరించినట్టు ఓపెన్ఏఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాట్‌జీపీటీ దాదాపు 40 నిమిషాలు పనిచేయలేదని, ఆ సమయంలో సర్వీసు అందుబాటులో లేదని వినియోగదారులు వాపోయారు. వ్యాపారాల కోసం రూపొందించిన చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ కొంతమంది వినియోగదారులకు 'ఎలివేటెడ్ ఎర్రర్ రేట్‌లను' ఎదుర్కొంటున్నారని కూడా ఓపెన్ఏఐ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో చాట్ జీపీటీ మరో సమస్యను ఎదుర్కొంది. అప్పుడు దాదాపు 10శాతం మంది వినియోగదారులు చాట్‌జీపీటీకి మెసేజ్ పంపలేకపోయారని కంపెనీ తెలిపింది. గత నవంబర్‌లో ఏఐ టెక్నాలజీ టూల్ చాట్ జీపీటీకి పెద్ద అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సాంకేతిక సమస్యలకు కారణమేమిటనే దానిపై ఓపెన్ఏఐ వివరణ ఇవ్వలేదు. ఏఐ కంపెనీ ప్రకారం.. చాట్‌జీపీటీ చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యూజర్ యాప్‌గా రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు వారానికోసారి దాదాపు 100 మిలియన్లతో యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది.
0 Comments