దేశీయ మార్కెట్లో ఇటాలియన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ అప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ అయ్యింది. రూ. 4.10లక్షలు ధరతో గోవాలో జరిగిన ఇండియన్ బైక్ ఫెస్టివల్ లో ఆవిష్కరించారు. ఈ ఇటాలియన్ బ్రాండ్ తొలిసారి పూర్తి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా ఈ బైక్ ను లాంచ్ చేసింది.. అలాగే పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తుంది. డిజైన్ విషయంలో ఇప్పటికే ఉన్న ఆర్ఎస్660, ఆర్ఎస్ వీ4 వంటి వాటికి దగ్గరగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ స్లీక్, షార్ప్, స్పోర్ట్ డిజైన్ లో వస్తుంది. మంచి అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది. ఎరోడైనమిక్ డిజైన్ ఉంటుంది 5 అంగుళాల కలర్డ్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మల్టీ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ క్విక్ షిఫ్టర్. ఈ స్పోర్ట్స్ బైక్ లో మెకానిజం గమనిస్తే.. ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్, యూఎస్డీ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ ఉంటుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ డ్యూయల్ చానల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది… దృడమైన బాడిని కూడా కలిగి ఉంది.. అదే విధంగా 457సీసీ లిక్విడ్ కూల్డ్ పారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. మొత్తం బండి బరువు 159కేజీలు ఉంటుంది,. మొత్తానికి ఇది యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం భారీ సేల్ తో దూసుకుపోతుంది.
0 Comments