Ad Code

పాన్ కార్డు ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయండి !


పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఆధార్, పాన్ లింకింగ్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలనేది చాలామందికి అవగాహన ఉండదు. కొంతమంది పాన్ కార్డు ఆధార్ లింక్ చేసుకున్నా తర్వాత అది పూర్తి స్థాయిలో లింక్ అయిందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే  మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదని గమనించాలి. అందుకే ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్లో ఆధార్, పాన్ లింక్ అయిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌తో పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను లింక్ చేయాలి. తద్వారా పన్ను చెల్లింపులు, టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్‌లు, ఆదాయ రిటర్న్‌లు, లావాదేవీలు, కరస్పాండెన్స్‌లతో సహా వ్యక్తిగత లావాదేవీలను క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో పాన్ కార్డు ఎలా ధృవీకరించాలో తెలుసుకోండి. మీ పాన్ కార్డ్ యాక్టివ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం. మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. 80 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. నివాసితులు కానివారు, భారత పౌరులు కాని వారితో సహా ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం నుంచి మినహాయించిన నిర్దిష్ట గ్రూపులుగా చెప్పవచ్చు.

పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేయడానికి ఈ కిందివిధంగా ప్రయత్నించవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (incometax.gov.in/iec/foportal/) ను విజిట్ చేసి Quick Links సెక్షన్ నావిగేట్ చేయండి. లింక్ ఆధార్ స్టేటస్ ఎంచుకోండి. పాన్, ఆధార్ కార్డ్ నంబర్‌లను ఎంటర్ చేయండి ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది. పాన్ కార్డ్, ఆధార్ లింక్ అయితే స్క్రీన్ 'Linked' అని సూచిస్తుంది. లింక్ చేయకపోతే.. రెండు కార్డ్‌లను లింక్ చేయడానికి అవసరమైన వివరాలను సూచిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu