దేశీయ మార్కెట్లోకి లావా యువ 3 ప్రో విడుదలైంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఏజీ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను స్వీకరించి అప్‌గ్రేడ్ చేస్తుంది. 269పీపీఐ పిక్సెల్ సాంద్రత, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్‌తో డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసెక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది.. అంతేకాదు డ్యూయల్ సిమ్ కూడా ఉంది.. అంతేకాదు అదనపు స్టోరేజీతో ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు విస్తరించవచ్చు.. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఎసి, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.. స్క్రీన్ ఫ్లాష్‌తో ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా సెన్సార్ అందిస్తుంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించవచ్చు.. ఇంకా మరెన్నో ఫీచర్స్ ను కలిగి ఉంది.. 18డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్టుతో 5,000 ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసింది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 38 గంటల టాక్ టైమ్ వస్తుంది.. ఈ ఫోన్ బరువు 200 గ్రాములు.. ఇక ధరను చూస్తే.. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 8,999కు పొందవచ్చు. ఈ కొత్త ఫోన్ లావా ఇ-స్టోర్‌లో డెసర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్, మెడో పర్పుల్ కలర్ లలో లభిస్తుంది.
0 Comments