జనవరి 17న శాంసంగ్ గెలాక్సీ S24 విడుదల ?


నవరి 17న శాంసంగ్ గెలాక్సీ S24 విడుదలయ్యే అవకాశాలు వున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది.  యూరప్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు ఈయూఆర్ 899 (సుమారు రూ. 82వేల) ప్రారంభ ధరతో వస్తుంది. 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 959 (సుమారు రూ. 88వేలు) ఉండవచ్చు. గెలాక్సీ ఎస్24+ ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 1,149 (సుమారు రూ. 1,05,000) మధ్య ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా బ్రాండ్ నుంచి అత్యంత ప్రీమియం ఆఫర్‌గా అందించనుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ వెర్షన్ ధర ఈయూఆర్ 1,449 (సుమారు రూ. 1,33,500) ధర ఉంటుంది. శాంసంగ్ అల్ట్రా మోడల్‌ను 12జీబీ ర్యామ్+ 512జీబీ 12జీబీ + 1టీబీ వేరియంట్‌లతో రానుంది. ఈ శాంసంగ్ ధర వరుసగా ఈయూఆర్ 1,569 (దాదాపు రూ. 1,44,500), ఈయూఆర్ 1,809 (సుమారు రూ. 1,66,500) మధ్య ఉండవచ్చు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org