జియో రీఛార్జ్ పై 20 శాతం క్యాష్ బ్యాక్


జియో ఆఫర్లు, జియో బెస్ట్ ప్లాన్లు, జియో క్యాష్ బ్యాక్ ఆఫర్ 299, రూ.666, రూ.719 ప్లాన్‌పై జియో 20 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ను ప్రకటించింది. గతంలో ఈ ప్లాన్ల ధరలు రూ. 249, రూ. 555, రూ. 599గా ఉండేది. అయితే ఇటీవల ఈ ప్లాన్ల ధర ఇటీవల పెరగడంతో అవి రూ.299, రూ.666, రూ.719గా మారాయి. Jio Rs 719 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకునే వినియోగదారులు నిత్యం 2జీబీ డేటాను పొందుతారు. ఇంకా ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. జియో యాప్స్ కు ఉచిత యాక్సెల్ లభిస్తుంది. Jio Rs 666 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1.5జీబీ డేటా లభిస్తుంది. ఇంకా ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. Jio Rs. 299 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో నిత్యం 2 జీబీ డైలీ డేటా లభిస్తుంది. ఇంకా అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లు పంపించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్లను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా లభించిన క్యాష్ బ్యాక్ ను రిలయన్స్ రిటైల్ స్టోర్స్, జియో ఆన్‌లైన్‌ షాపింగ్ పోర్టల్స్ లో వినియోగించుకోవచ్చని జియో తెలిపింది. ఇలా రీఛార్జ్ ల ద్వారా వినియోగదారులు గరిష్టంగా ప్రతీ రోజు రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని జియో తన ప్రకటనలో పేర్కొంది

No comments:

Post a Comment

3