వినియోగదారుల రోజువారీ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త కార్డును ఇటీవల ఆవిష్కరించింది.. వన్ నేషన్ వన్ కార్డ్ నినాదంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజర్ల కోసం సరికొత్త ట్రాన్సిట్ కార్డును విడుదల చేసింది. ఈ కార్డు మునుపెన్నడూ లేని విధంగా మీ లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఈ కార్డును వినియోగదారులు తమ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. మెట్రో, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు, మర్చంట్ స్టోర్లలో, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్లైన్ షాపింగ్ పేమెంట్స్ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఈ కార్డు ద్వారా మీరు ఏటీఎం నుంచి డబ్బు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. భారతీయులందరికీ బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేసేందుకు ఈ ట్రాన్సిట్ కార్డును ప్రారంభించామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మిలియన్ల కొద్దీ భారతీయుల రోజువారీ అవసరాలకు చేసే చెల్లింపులను ఒకే ఫిజికల్ కార్డుతో అందించాలనే ఉద్దేశంతో ఈ కార్డును విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ ట్రాన్సిట్ కార్డు నేరుగా పేటీఎం వ్యాలెట్‌తో లింక్ చేసి ఉంటుంది. ఈ కార్డును దరఖాస్తు చేసుకున్న యూజర్లకు నేరుగా వారి ఇంటికే డెలివరీ చేస్తుంది. పేటీఎం ట్రాన్సిట్ కార్డ్ పరిచయంతో, వినియోగదారులు ఇకపై అన్ని రకాల కార్డ్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. పేటీఎం సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ట్రాన్సిట్ కార్డుతో నేరుగా మెట్రో ఛార్జీలను చెల్లించవచ్చు. ట్రాన్సిట్ కార్డ్ ఇప్పటికే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్, అహ్మదాబాద్ మెట్రోలో అందుబాటులో ఉంది. వినియోగదారుల అన్ని అవసరాలను ఒకే కార్డుతో తీర్చాలని పేటీఎం భావించింది. ఈ 'వన్ నేషన్ వన్ కార్డ్' నినాదంతోనే కొత్త కార్డును ఆవిష్కరించింది. మెట్రో, బస్సు, రైలు సేవలను క్రమం తప్పకుండా ఉపయోగించే 50 లక్షలకు పైగా రైడర్లకు ఈ ట్రాన్సిట్ కార్డ్ ఉపయోగపడుతుందని పేటీఎం పేర్కొంది. వినియోగదారులు పేటీఎం యాప్ ద్వారా ట్రాన్సిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పేటీఎం సేల్స్ పాయింట్ల నుంచి కూడా వినియోగదారులు కార్డ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డును నేరుగా పేటీఎం వాలెట్‌కి లింక్ చేయవచ్చు. పేటీఎం యాప్‌లోనే అన్ని లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు.
0 Comments