ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లకు టారిఫ్ వోచర్, ప్లాన్లతో సంబంధం లేకుండా ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కల్పించాలంటూ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లందరికీ దీన్ని వర్తింపజేయాలని సూచించింది. అంతేకాదు, పోర్టింగ్ కోసం నిర్ధిష్ట కోడ్ (యూపీసీ)ని పొందడానికి 1900కు ఎస్ఎంఎస్ పంపే సదుపాయాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లు 1900కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ ఫోన్‌కు వచ్చే కోడ్‌ను కొత్త ఆపరేటర్ కు తెలియజేయడం ద్వారా నెట్వర్క్ మార్చుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని టెల్కోలు విడివిడిగా ఎస్ఎమ్ఎస్ ప్యాకేజీలను అందించడం లేదు. అన్లిమిటెడ్ ప్యాక్‌తో పాటే రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తున్నాయి. దీని వల్ల వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్ల ప్రీపెయిడ్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ లేనందున పోర్టింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్ఎంఎస్ కోసం మరింత అధిక టారిఫ్ ఫ్లాన్నో లేదా ప్రత్యేక ప్యాకేజీనో ఎంచుకోవాల్సి వస్తోంది. టెలికాం ఆపరేటర్లు అమలు చేస్తున్న ఈ కొత్త విధానంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధానాన్ని మార్చాలని మొబైల్ కస్టమర్ల నుంచి ట్రాయ్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో, అన్ని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 'ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ (Mobile) యూజర్లందరూ తమ ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ పొందడం హక్కు. పోర్టబిలిటీ కోసం ఎస్ఎమ్ఎస్ పంపే సదుపాయం నిరాకరించడం కస్టమర్ల హక్కులను కాలరాయడమే. ఇది ట్రాయ్ నిబంధలకు పూర్తిగా వ్యతిరేకం. అందువల్ల, కస్టమర్లందరికీ 1900 ద్వారా ఎస్ఎమ్ఎస్ పంపి నంబర్ పోర్టబుల్ కోరే అవకాశం అందుబాటులోకి తేవాలి." అని మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు, కస్టమర్ ప్లాన్ లేదా వోచర్లో బ్యాలెన్స్ (Balance) ఉన్నా.. లేకున్నా.. మొబైల్ నంబర్ పోర్టబులిటీకి టెలికాం ఆపరేటర్లు సహకరించాల్సిందేనని ట్రాయ్ ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని కూడా కోరింది. పోర్ట్ అవుట్ ఎస్ఎస్ఎంఎస్ సెండింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపింది. అయితే, ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తమ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది కస్టమర్లు తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లను అమలు చేస్తున్న నెట్‌వర్క్‌కు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.
0 Comments