షియోమి 12 ప్రొ స్మార్ట్‌ఫోన్ 3సీ, టీనా సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్టు టెక్ నిపుణులు వెల్లడించారు. షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను డిసెంబర్ 28న లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. షియోమి 12 సిరీస్‌లో భాగంగా షియోమి 12, షియోమి 12X, షియోమి 12 ప్రొ, షియోమి 12 అల్ట్రా, షియోమి 12 లైట్, షియోమి 12 లైట్ జూమ్ వంటి ఆరు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. స్పెసిఫికేషన్స్ ప్రకారం షియోమి 12 ప్రొ 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీతో బూట్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఓఎస్‌పై రన్ కానుంది. షియోమి 12 2కే రిజల్యూషన్‌తో 6.7 ఇంచ్ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. షియోమి 12 ప్రొ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను కలిగిఉంటుంది. ఇక షియోమి 12 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలు అధికంగా ఉండటంతో పాటు ఈ స్మార్ట్ డివైజ్ 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
0 Comments