2022 జనవరిలో లాస్‌వెగాస్‌లో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో కు ముందు లేటెస్ట్ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఎల్‌జీ లాంఛ్ చేసింది. ఎల్‌జీ అల్ట్రాగేర్ 17జీ90Q గేమింగ్ ల్యాప్‌టాప్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టంతో ముందుకొచ్చింది. సీఈఎస్ 2022 షోలో ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించి మరింత సమాచారం అందుబాటులోకి రానుంది. ఎల్‌జీ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్ 11 జెన్ ఇంటెల్ టైగర్ లేక్ హెచ్ ప్రాసెసర్, ఎన్‌విదియా గెట్‌ఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3080 మాక్స్-క్యూ గ్రాఫిక్స్ కార్డ్, డ్యూయల్ ఛానల్ మెమరీ, అల్ట్రా ఫాస్ట్ డ్యూయల్ ఎస్ఎస్‌డీ సెటప్‌తో ఆకట్టుకోనుంది. గేమ్‌ను బట్టి ఎల్‌జీ అల్ట్రాగేర్ స్టూడియో యూజర్లను సీపీయూ, జీపీయూలను కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌తో పాటు నెంబర్ ప్యాడ్‌తో కూడిన ఫుల్ సైజ్ కీబోర్డు లభిస్తుంది. ఇక తొలుత కొరియాలో అందుబాటులో ఉండే ఎల్‌జీ అల్ట్రాగేర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆపై దశలవారీగా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెడతారు.
0 Comments