రియల్‌మీ నార్జో 50ఏ పై ఫ్లిప్‌కార్ట్ లో సూపర్ ఆఫర్


రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.13,999 కాగా, ఫ్లిప్ కార్ట్ లో 10 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే ఈ ఫోన్ ను ఎవరైనా రూ. 1500 తగ్గింపుతో రూ. 12,499కి కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు ఇతర డిస్కౌంట్ ఆఫర్లు సైతం ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ పై అనేక బ్యాంక్ ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే.. క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా ఈ ఫోన్ పై రూ. 1500 అడిషనల్ డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ. 11,000కు ఈ పోన్ సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు భారీ ఎక్సేంజ్ ఆఫర్ ఈ ఫోన్ పై అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ ఎక్సేంజ్ ఆఫర్ ను పొందొచ్చు. ఈ ఫైన్ పై ఫ్లిప్ కార్ట్ రూ. 11, 850 ఎక్సేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఈ ఆఫర్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే రూ. 11,850 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధర రూ. 12,499 కాగా.. ఎక్సేంజ్ ఆఫర్ రూ. 11,850 తో కేవలం రూ.649కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ 256జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org