హువీ నుండి స్మార్ట్‌వాచ్ 23న మార్కెట్లోకి...!


టెక్ దిగ్గజం హువీ ఈనెల 23న న్యూ స్మార్ట్‌వాచ్ హువీ వాచ్ డీని లాంఛ్ చేయనుంది. హువీ వాచ్ డీ హెల్త్ యాప్‌తో పాటు బీపీ మానిటర్‌తో కస్టమర్ల ముందుకు రానుందని యాండ్రాయిడ్ కమ్యూనిటీ తెలిపింది. యూజర్లు తమ బీపీ ఫలితాల హిస్టరీ సమాచారాన్ని ఈ స్మార్ట్‌వాచ్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. బీపీ స్ధాయిల మెరుగుదల కోసం యూజర్లు ఫలితాలను మానిటర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని యాండ్రాయిడ్ కమ్యూనిటీ నివేదిక తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4లో అందుబాటులో ఉండే ఫీచర్‌ను ఇది పోలి ఉంటుంది. బీపీ ఫీచర్ కచ్చితత్వం మెరుగ్గా ఉందని పరీక్షలో వెల్లడైందని పేర్కొంది. ఇది ప్రతిరోజూ వేగంగా బీపీ చెక్ చేసుకునేందుకు ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో మెడికల్ గ్రేడ్ ఎలక్ట్రోకార్డియోగ్రాం (ఈసీజీ) కూడా ఉంటుందని నివేదిక పేర్కొంది.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org