ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సంస్థ టీవీఎస్ భారత మార్కెట్లోకి మరో ప్రీమియం బైక్‌ను లాంచ్ చేసింది. టీవీఎస్ అపాచీ 165 ఆర్పి (రేస్ పర్ఫార్మెన్స్) ) పేరుతో దీన్ని విడుదల చేసింది. టీవీఎస్ ఆర్పీ సిరీస్‌లో దేశీయ మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి బైక్ ఇదే కావడం విశేషం. భారతదేశంలో అపాచీ ఆర్టీఆర్165 ఆర్పీ రూ.1.45 లక్షల వద్ద లభిస్తుంది. ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్‌లో కొన్ని మెకానికల్ ఛేంజెస్, కొత్త స్పోర్టీ లైవరీ వంటివి చేర్చింది. కాగా, టీవీఎస్ భారత మార్కెట్లో అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్‌లను కేవలం 200 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుందని తెలిపింది. ఈ బైక్ త్వరలోనే బుకింగ్‌లకు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్165 ఆర్పీ బైక్.. 164.9 సీసీ సింగిల్- సిలిండర్, ఫోర్ -వాల్వ్ ఇంజన్‌తో లభిస్తుంది. 10,000 ఆర్పీఎం వద్ద 19 బీహెచ్పీ, 8,750 ఆర్పీఎం వద్ద 14 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 35 శాతం కొత్త సిలిండర్ హెడ్, 15 శాతం పెద్ద వాల్వ్‌లు, ఫ్రీ-రివింగ్ కోసం రివైజ్డ్ బోర్ స్ట్రోక్, అధిక కంప్రెషన్ రేషియో, కొత్త డోమ్ పిస్టన్లని కలిగి ఉంటుంది. ఇది పవర్‌ప్లాంట్ స్లిప్పర్ క్లచ్‌తో ఐదు -స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేసి ఉంటుంది. అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీలో 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో 240 ఎంఎం బ్యాక్ డిస్క్ బ్రేక్‌లను అమర్చింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ రేసింగ్ డీకాల్స్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, రెడ్ అల్లాయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, బ్రాస్-కోటెడ్ డ్రైవ్ చైన్, స్ప్రాకెట్, కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్, రెడ్ సీటు ప్యాటర్న్, వెనుక వైపు రేడియల్ టైర్లను అమర్చింది. ఈ బైక్ లాంచింగ్‌పై టీవీఎస్ మార్కెటింగ్ ప్రీమియం బిజినెస్ హెడ్ మేఘశ్యామ్ డిఘోల్ మాట్లాడుతూ, ''మా కస్టమర్లకు రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆర్పీ సిరీస్‌లోని రేస్ మెషీన్లు మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటాయి. బ్లిస్టరింగ్ పర్ఫార్మెన్స్ను అందించే ఏకైక ఉద్దేశ్యంతో వీటిని రూపొందించాం. ఇవి రేసింగ్ ట్రాక్ & హైవే రోడ్లపై వేగంగా ప్రయాణించగలవు." అని అన్నారు. కాగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మొదటి ప్రొడక్ట్. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఫీచర్లతో విడుదలైంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్ లాంచ్
by Telugu Lo Computer at December 23, 2021
Labels:
automobile
,
science
,
technologe
,
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 165 ఆర్పీ బైక్ లాంచ్
,
రేసింగ్ ట్రాక్ & హైవే రోడ్లపై వేగంగా ప్రయాణించగలవు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment