చాలామందికి బోర్ కొడితేనో, కాస్త తీరిక సమయం దొరికితేనో మొదట చేసే పని యూట్యూబ్ ఓపెన్ చేయడం. మనకిష్టమైన వీడియోలను కావాల్సినంతసేపూ చూసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాలకు సంబంధించిన టీజర్లు, పాటలు, ట్రైలర్లు యూట్యూబ్‌లోనే విడుదలవుతుంటాయి. సాధారణంగా మనం వీడియోలను వీక్షించడమే కానీ డౌన్లోడ్ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అయితే డేటా స్పీడ్‌లో సమస్యలున్నప్పుడు, ఇతర కారణాలతో కొంతమంది వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటారు. తీరికదొరికినప్పుడు వాటిని చూస్తుంటారు. ఇందులో ఉన్న ప్రయోజనాలేంటంటే ఇలా ఆఫ్‌లైన్ డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు ఇంటర్నెట్ తో సంబంధం లేదు. ప్రకటనలు కూడా ఉండవు. పైగా ఎన్నిసార్లయినా వీటిని చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో వీడియోలు డౌన్లోడ్ చేసుకునే వారికి యూట్యూబ్ షాకిచ్చింది. సాధారణంగా లో, మీడియం, హై, ఫుల్ హెచ్డీ ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియోలైనా ఉచితంగా ఆఫ్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే తాజా నిబంధనల ప్రకారం.. హై, ఫుల్ హెచ్డీ క్వాలిటీ వీడియోలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం ఇకపై కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే ప్రతి నెలా సబ్‌స్ర్కిప్షన్ డబ్బులు కట్టాలన్నమాట. యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంతో లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యముంది. అయితే యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. కాగా యూట్యూబ్ లో ఇప్పటికే యాడ్ ఫ్రీ గా వీడియోలు చూడాలంటే నెల నెలా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
యూజర్లు ఇక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలసిందే!
by Telugu Lo Computer at December 30, 2021
Labels:
internet
,
science
,
technologe
,
youtube
,
టీజర్లు
,
ట్రైలర్లు యూట్యూబ్‌లోనే విడుదలవుతుంటాయి
,
పాటలు
,
యూజర్లు ఇక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలసిందే
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment