భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, ఉమ్మడి కుటుంబం కల్చర్ కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్లిల్లు, ఫంక్షన్లు, తీర్థయాత్రలు ఎక్కడకు వెళ్లినా కుటుంబ సమేతంగానే వెళ్లడం భారతీయులకు అలవాటు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే, పెద్ద కార్లను ఆటో రంగంలోని అన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో టాటా సుమో, టొయోటా క్వాలిస్ లాంటి వాహనాలకు చాలా డిమాండ్ నడిచింది. ఇప్పుడు అదే బాటలో మరిన్ని వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మహీంద్రా బొలేరే ఇది 7 సీట్ల SUV, 1493 cc డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది డీజిల్ SUV , 1 లీటర్ డీజిల్ తో 16.7 కి.మీల మైలేజీ లభిస్తుంది. కానీ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.72 లక్షలు. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన 7 సీట్ల కారు ఇది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్లలో వస్తుంది. దీని మైలేజీ విషయానికి వస్తే లీటరుకు 17-20 కిలోమీటర్లు వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.96 లక్షలు ఎక్స్-షోరూమ్. రెనాల్ట్ ట్రైబర్‌లో 999 సీసీ పెట్రోల్ ఇంజన్ తో కూడిన ఈ కారులో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు మాన్యువల్ , ఆటోమేటిక్ వేరియంట్లతో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.53 లక్షలు ఎక్స్-షోరూమ్. గతంలో మారుతి ఓమిని వ్యాన్ గా ప్రసిద్ధి చెందిన ఈ కారు, ప్రస్తుతం ఈకో పేరుతో మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారు CNG , పెట్రోల్ వేరియంట్ తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 4.38 లక్షలు ఎక్స్-షోరూమ్. దీనికి 1196 సిసి ఇంజన్ పవర్ తోడుకాగా. ఇది ఒక కిలో గ్యాస్‌లో 20 కి.మీ వరకు వెళ్లగలదు. అలాగే ఒక లీటరు పెట్రోలుకు 20 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ కారు 5 , 7 సీటర్ రెండు వేరియంట్లలో వస్తుంది.
కుటుంబ సమేతంగా ప్రయాణించాలంటే ....!
by Telugu Lo Computer at December 30, 2021
Labels:
automobile
,
science
,
technologe
,
కుటుంబ సమేతంగా ప్రయాణించాలంటే
,
మారుతీ సుజుకి ఈకో
,
మారుతీ సుజుకి ఎర్టిగా
,
రెనాల్ట్ ట్రైబర్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment