ఫేస్బుక్ కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే, సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఫేస్బుక్.. ఇప్పుడు మరింత మంది యూజర్లను చేర్చుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా ఫీచర్లు విడుదల చేస్తోంది. తాజాగా, ఫేస్బుక్ తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో లాక్ చేసిన ఖాతాలను తిరిగి తెరవాలనుకునే యూజర్ల కోసం లైవ్ చాట్ ఫీచర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఫేస్బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు.. తమ బ్లాక్ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు ఈ లైవ్ చాట్ ఫీచర్‌ను ఫేస్బుక్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను తిరిగి ప్రారంభించడం సులభమవుతుంది. లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంటుందని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే సంస్థకు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేయవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ ఫీచర్ యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇతర దేశాలకు కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్బుక్ ప్రకటించింది. ఫేస్బుక్ ఖాతాలకు ఇలా లైవ్ చాట్ అవకాశాన్ని కల్పించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లోని యూజర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించి, వారి ఖాతా ఎందుకు సస్పెండ్ అయిందో తెలుసుకునే అవకాశం లేదు. అయితే ఈ కొత్త లైవ్ 'ఫేస్బుక్ సపోర్ట్' చాట్ బాక్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి తమ ఖాతాలను తిరిగి పొందే అవకాశం లభిస్తుంది. సాధారణ ఫేబ్బుక్ యూజర్లతో పాటు కంటెంట్ క్రియేటర్స్‌కు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. తద్వారా వారు ఫేస్‌బుక్‌తో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. ఫేస్బుక్ ప్రమాణాలను ఉల్లంఘించిన కారణంగా సస్పెండ్ అయన ఖాతాలను తిరిగి తెరిచేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ''ప్రత్యేకంగా ఫేస్బుక్ యాప్‌లో ఇంగ్లీష్ మాట్లాడే వినియోగదారుల కోసం ఈ లైవ్ ఛాట్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించాం. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఫేస్బుక్ లైవ్ చాట్‌తో పాటు లైవ్ కంటెంట్ మోడరేషన్ టూల్‌ను కూడా అందుబాటులోకి తెస్తుంది. దీని ద్వారా యూజర్లు నిర్ధిష్ట పదాలను బ్లాక్ చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రైవసీ ఫీచర్లను సైతం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మీ ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిందా ?
by Telugu Lo Computer at December 13, 2021
Labels:
science
,
smart phone
,
technologe
,
మీ ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిందా ?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment