టెలికం కంపెనీలు ఒకేసారి ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచేశాయి. ప్రైవేట్ యాజమాన్య టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో అన్ని కూడా వాటి రీఛార్జ్ రేట్లను 20 నుండి 25 శాతం వరకూ పెంచాయి. ఇప్పుడు అందరికీ బిఎస్ఎన్ఎల్ ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ప్రభుత్వ టెలికం సంస్థ ఇప్పటికీ రీఛార్జ్ ప్లాన్స్ ను తక్కువ ధరకే అఫర్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి. అంటే, PORT 0123456789 ఈ ఫార్మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి. తరువాత, మీరు ఎంటర్ చేసి పంపిన మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. అదే, UPC Code (యూనిక్ పోర్టింగ్ కోడ్) వస్తుంది. తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా SIM స్టోర్లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను అందచేస్తారు. మీ ప్రూఫ్ జిరాక్స్ ను ఇవాల్సి ఉంటుంది. ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు.
ホーム
/
వోడాఫోన్ ఐడియా
/
అందరి చూపు బిఎస్ఎన్ఎల్ వైపు !
Saturday, December 11, 2021
20 నుండి 25 శాతం వరకూ పెంచాయి BSNL national science technologe అందరి చూపు బిఎస్ఎన్ఎల్ వైపు ఎయిర్ టెల్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ వోడాఫోన్ ఐడియా
No comments:
Post a Comment