'ఒమిక్రాన్' వేరియంట్‌ను రెండు గంటల్లోనే గుర్తించే టెస్టింగ్ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తయారు చేసింది. ఈ కిట్‌తో వేగంగా పరీక్షలు చేయడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ను గుర్తించేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి వస్తున్నది. దీంతో ఫలితాలు రావడానికి కనీసం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతున్నది. ఐసీఎంఆర్ దిబ్రూగఢ్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం డాక్టర్ బిశ్వజ్యోతి బోర్కకోటి నేతృత్వంలోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల బృందం టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. ట్రయల్స్ లో వందశాతం ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయన్నారు. సాధారణ స్వాబ్ శాంపిల్ ద్వారా వైరస్‌ను గుర్తించారు. ఈ కిట్‌ను పూర్తిగా ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో తయారు చేసుండగా.. కోల్‌కతాలోని డీసీసీ బయోటెక్‌కు ఐసీఎంఆర్ కాంట్రాక్ట్ ఇచ్చింది.
0 Comments