ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. టెక్నో నుంచి టెక్నో స్పార్క్ 8టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సెప్టెంబర్‌లో టెక్నో స్పార్క్ 8 మొబైల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో టెక్నో స్పార్క్ 8టీ వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. ఇప్పటికే ఇండియాలో ఈ బడ్జెట్లో పోకో సీ31, నోకియా సీ20 ప్లస్, రియల్మీ నార్జో 30ఏ, మోటో ఇ7 ప్లస్, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటికి పోటీ ఇవ్వనుంది టెక్నో స్పార్క్ 8టీ. టెక్నో స్పార్క్ 8టీ స్మార్ట్‌ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌లో మాత్రమే రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ధర రూ.8,999. రిలీజ్ కాగానే సేల్ ప్రారంభమైంది. అట్లాంటిక్ బ్లూ, కొకోవా గోల్డ్, ఐరిస్ పర్పుల్, టర్కోయిస్ సియాన్ కలర్స్‌లో కొనొచ్చు. టెక్నో స్పార్క్ 8టీ సేల్ అమెజాన్‌లో ప్రారంభమైంది. టెక్నో స్పార్క్ 8టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో ఫ్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ లాంటి మోడ్స్ ఉన్నాయి. ఏఐ బ్యూటీ, ఏఆర్ యానిమోజీ, స్టిక్కర్స్, గూగుల్ లెన్స్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, స్మార్ట్ పోర్ట్రైట్, వీడియో బొకే, 1080p టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ, 120fps స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 8టీ
by Telugu Lo Computer at December 16, 2021
Labels:
science
,
smart phone
,
technologe
,
అట్లాంటిక్ బ్లూ
,
ఐరిస్ పర్పుల్
,
కొకోవా గోల్డ్
,
టర్కోయిస్ సియాన్ కలర్స్
,
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 8టీ
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment