ఇటీవల కాలంలో ఇయర్ ఫోన్లు, ఇయర్‌బడ్స్ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బౌల్ట్ బ్రాండ్ వరుసగా ప్రొడక్టులను మార్కెట్లోకి వదులుతోంది. తాజాగా ఈ సంస్థ ఎయిర్ బాస్ ప్రోపాడ్స్ ఎక్స్ ట్రూ వైర్లెస్ స్టీరియో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ వెర్లెస్ ఇయర్ బడ్స్ లో 10ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. టచ్ కంట్రోల్ ద్వారా కాల్ రిజెక్షన్స్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, మ్యూజిక్ ట్రాక్ లాంటి వాటిని నియంత్రించవచ్చు. టైప్-సీ యూఎస్బీ పోర్టును కలిగి ఉన్న ఈ ఇయర్ ఫోన్లకు IPX5 రేటింగ్ ఇచ్చారు. స్వెట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉన్న ఈ ఇయర్ బడ్స్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి, 32 గంటల పాటు ప్లే టైమ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ సరికొత్త బౌల్ట్ ఎయిర్ బాస్ ప్రోపాడ్స్ ఎక్స్ ఇయర్ ఫోన్లు ధర భారత్ లో రూ.1499గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్ లో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి బ్లాక్ కలర్లో మాత్రమే లభిస్తున్నాయి. అందుబాటులో ధరతో పాటు సంవత్సరం పాటు వీటికి ఇండస్ట్రీ వారంటీని కూడా ఇచ్చింది ఈ కంపెనీ. ఈ సరికొత్త బౌల్ట్ ఇయర్ఫోన్లు 10 ఎంఎం ఆడియో డ్రైవర్స్, ఇన్ బిల్ట్ మైక్రో వూఫర్లతో వస్తాయి. వీటి ద్వారా పవర్ ఫుల్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ప్రతి ఇయర్ బడ్ కు మైక్రోఫోన్ సౌలభ్యం కూడా ఉంది. ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా సిలికాన్ టిప్స్ ను వీటిలో పొందుపరిచారు. టచ్ కంట్రోల్స్ సాయంతో వివిధ రకాల సర్వీసెస్‌ను కంట్రోల్ చేయవచ్చు. కాల్ రిజెక్షన్స్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, మ్యూజిక్ ట్రాక్ లాంటి వాటిని నియంత్రించవచ్చు. వాయిస్ అసిస్టెంట్లు అయిన సిరి, గూగుల్ అసిస్టెంట్లకు కూడా ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉన్న ఈ ఇయర్ ఫోన్లు వర్షం, నీరు, చెమటతో ఏమాత్రం ప్రభావితం కావు. బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఆప్షన్ వీటిలో ఉంది. ఈ సరికొత్త ఇయర్ బడ్స్ ఆటో పెయిరింగ్ సపోర్టును కలిగి ఉన్నాయి. అంటే విడిగా వీటిని ఉపయోగించవచ్చు. కాల్స్ తీసుకోవడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి స్టీరియో మోడ్, మోనో పాడ్ లో ఉపయోగించుకోవచ్చు. టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల 10 నిమిషాల ఛార్జ్ తో 100 నిమిషాల వరకు ప్లేబ్యాక్ టైమ్ పొందవచ్చు. పూర్తి ఛార్జ్ తో 8 గంటల ప్లేటైమ్ వస్తుంది. గరిష్ఠంగా 32 గంటల పాటు వినియోగించవచ్చు.
బౌల్ట్ నుంచి లేటెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ లాంచ్
by Telugu Lo Computer at December 22, 2021
Labels:
electric & electronics
,
science
,
technologe
,
బౌల్ట్ నుంచి లేటెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ లాంచ్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment