ప్రతి ఒక్కరు తమ సహోద్యోగులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సంప్రదిస్తున్నారు. ఇలా ఆన్‌లైన్ ద్వారా ఒకరితో ఒకరు సులభంగా సమన్వయం చేసుకోడానికి సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'కమ్యూనిటీలు' అని పిలవబడే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అడ్మిన్‌లు ఎక్కువ వాట్సాప్ గ్రూపులను లింక్ చేయడానికి, వాటిని పెద్ద కమ్యూనిటీ గ్రూప్‌లో ఉంచడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఇతరులతో సంప్రదింపులు వేగంగా జరపవచ్చు. వాట్సాప్ కమ్యూనిటీలు, 10 అడ్మిన్ వాట్సాప్ గ్రూప్‌లను ఒకే కమ్యూనిటీకి లింక్ చేయడానికి అనుమతిస్తాయి. ఈ ఫీచర్ వాట్సాప్ మేనేజర్ బీటా కొత్త అప్‌డేట్ 2.22.1.1 ద్వారా ఐఓఎస్ బీటా బిల్డ్‌లో విడుదల చేసింది. గ్రూప్ అడ్మిన్‌లు వాట్సాప్‌లోని ఇతర గ్రూపులపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటారు. వాట్సాప్ కమ్యూనిటీ అడ్మిన్, గ్రూప్ అడ్మిన్ కంటే ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటారు. ఉదాహరణకు, కార్యాలయంలో వేర్వేరు విభాగాల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు ఉంటాయి. హెచ్ఆర్ హెడ్ లేదా సిఇఓ అన్ని గ్రూప్‌లను ఒకదానికొకటి లింక్ చేయడానికి WhatsApp కమ్యూనిటీని సృష్టించవచ్చు. కమ్యూనిటీ ద్వారా HR హెడ్ లేదా CEO, లింక్ చేయబడిన అన్ని గ్రూప్‌లపై నియంత్రణ కలిగి ఉంటారు. కమ్యూనిటీ ఫీచర్ ప్రస్తుతం గ్రూప్ చాట్ లాగానే కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది. కొత్త కమ్యూనిటీ ఫీచర్ టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోటీ పడవచ్చు.
0 Comments