ప్రజలలో భాషా జ్ఞానాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ పేరు భాషా సంగం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రచారం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కింద ఈ మొబైల్ యాప్ రూపొందించారు. యాప్ పూర్తిగా ఉచితం. ఎవరైనా దీన్ని తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ భాషలను నేర్చుకోవచ్చు. ఈ యాప్లో దేశంలోని 22 భాషలు ఉన్నాయి. వీటిని నేర్చుకోవచ్చు. చదవవచ్చు. భాషా అభ్యాసానికి ఆటలు ఏర్పాటు చేశారు ఈ యాప్ లో. అంటే, యాప్లో గేమ్స్ ప్లే చేయడం ద్వారా చాలా భాషలు సులభంగా నేర్చుకోవచ్చు. ఈ యాప్ పూర్తిగా ఆన్లైన్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఈ యాప్ మొబైల్ యూజర్ వివిధ భాషలను నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. యాప్లో ఉన్న భాషను నేర్చుకోవాలనుకునే ఎవరైనా దానిని నేర్చుకోవచ్చు. భారతదేశంలోని 22 అధికారిక భాషలు యాప్లో ఉన్నాయి. దీని అభ్యాసం పూర్తిగా ఉచితం. ఈ 22 భాషల్లో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి, డోగ్రీ ఉన్నాయి. ఈ యాప్ను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ లింగ్విస్టిక్ మొబైల్ యాప్ ద్వారా రోజువారీ ప్రసంగం, భాషలో ఉండే పదాలు, వాక్యాలను నేర్చుకోవచ్చు. భాషతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు. ఈ లెసన్ యాప్ సులభంగా నేర్చుకోవడానికి గేమ్ లాగా రూపొందించారు. వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నలు.. సమాధానాలు వ్యక్తిగతీకరించిన ప్రాతిపదికన రూపొందించారు. ఇది భాషా అభ్యాసంలో సహాయపడుతుంది. వినియోగదారు ఖచ్చితత్వ స్థాయిని తనిఖీ చేయడానికి.. ప్రతిరోజూ పురోగతిని తనిఖీ చేయడానికి రోజువారీ అభ్యాస వ్యవస్థ సృష్టించారు. భాషకు సంబంధించిన పదబంధాలను వినియోగదారు సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాల సహాయంతో భాషా పరిజ్ఞానం అందించారు. దేశంలోని విభిన్న సంస్కృతిని తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి 44 ప్రత్యేక పాత్రలు సృష్టించారు. వివిధ భాషలలో ఉన్న 500 సాంస్కృతిక చిట్కాలు ఇందులో ఉన్నాయి. ఇది మన సంస్కృతితో కనెక్ట్ అయ్యే ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చిన వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేలా వ్యవస్థ రూపొందించారు. పురోగతి గురించి తెలుసుకోవడానికి ప్రతి పాఠం పూర్తయిన తర్వాత స్టార్ స్కోర్ ఉంటుంది. మీరు ఎంత నేర్చుకుని ఎంత పురోగతి సాధించారు అనే దాని ఆధారంగా పొందిన స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుంది. మొబైల్ వినియోగదారు భాషా సంగం యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అతనికి/ఆమెకు తెలిసిన ..భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలను నేర్చుకోవచ్చు. అభ్యాసం ఆధారంగా, వినియోగదారు తన స్వంత పరీక్షను నిర్వహించవచ్చు. దాని ఆధారంగా ఆన్లైన్లో సర్టిఫికేట్ను సాధించవచ్చు. ఈ మొబైల్ యాప్ను దేశంలో ఒకే ఒక స్టార్టప్ మల్టీ భాషలలో తయారు చేసింది. ఈ యాప్ ఉద్దేశ్యం పాఠశాల పిల్లలకు ముఖ్యంగా రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ భాషల గురించి సమాచారాన్ని అందించడం.
అన్ని భాషలూ నేర్చేసుకోండిలా...!
by Telugu Lo Computer at December 12, 2021
Labels:
national
,
science
,
technologe
,
అన్ని భాషలూ నేర్చేసుకోండిలా
,
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
,
భాషా సంగం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment